Recorded Telugu translations
ఇంతకన్నానందమేమొ ఓరామ రామ ॥ఇం॥
సంతజనులకొల్ల సమ్మతియుంటే కాని ॥ఇం॥
ఆడుచు నాదమునఁ బాడుచు ఎదుటరా
వేడుచు మనసునఁగూడి యుండేది చాలు
శ్రీహరికీర్తనచే దేహాదియింద్రియ స
మూహముల మఱచి సోహమైనదె చాలు
నీజపములవేళ నీజగములు నీపై
రాజిల్లు నయ త్యాగరాజనుత చరిత్ర
No comments:
Post a Comment