Recorded Telugu translations
ఎంత భాగ్యమో మాపాలఁ గల్గితివి
ఎవరీడు ముజ్జగములలోఁ దన కెం..
చెంతఁజేరి సౌజన్యుఁడై పలికి
చింత బాగ తొలగించి బ్రోచితివి ఎం..
మున్ను మీ సమీపమున వెలయు స
న్మునులనెల్ల నణిమాది లీలలచేఁ
దిన్నగాను పాలనఁ జేసి నటు
నన్నుఁ గాచితివి త్యాగరాజనుత ఎం..
No comments:
Post a Comment