ఆడమోడిగలదే

 


ఆడమోడిగలదే రామయ్యమాట లా..


తోడునీడ నీవె యనుచు భక్తితోఁ

గూడి పాదములఁ బట్టినమాట లా..


చదువులన్ని దెలిసి శంకరాంశుఁడై

సదయుఁడాశుగ సంభవుండు మ్రొక్క

గదలు తమ్ముని బల్కఁ జేసితివి

గాకను త్యాగరాజేపాటి మాట లా..

No comments:

Post a Comment