ఏల నీ దయరాదు

(4-Basic1-80-A)

ఏల నీ దయరాదు 

పరాకు జేసే వేల సమయముగాదు ॥ఏ॥


బాల! కనకమయచేల! సుజనపరి

పాల! శ్రీరమాలోల! విధృతశర

జాల! శుభద! కరుణాలవాల! ఘన

నీల! నవ్య వనమాలికాభరణ! ॥ఏ॥


రారా దేవాదిదేవా! రారా మహానుభావా!

రారా రాజీవనేత్రా! రఘువరపుత్రా!

సారతర సుధాపూర హృదయ పరివార 

జలధిగంభీర దనుజ సంహార 

మదనసుకుమార బుధజన విహార 

సకలశృతిసార జలజముఖ  ॥ఏ॥


రాజాధిరాజ! మునిపూజిత పదారవింద 

రాజలోచన! శరణ్య! అతిలావణ్య!

రాజధరనుత విరాజ వాహ 

సురరాజవందిత పదాబ్జ! జనక! 

దినరాజకోటి సమతేజ! దనుజగజరాజ 

నిచయ మృగరాజ! నాదుపై  ॥ఏ॥


యాగరక్షక! పరమ భాగవతార్చిత!

యోగీంద్ర సుహృద్భావిత! ఆద్యంతరహిత!

నాగశయన! వర నాగవరద! 

పున్నాగ సుమధర! సదాఘమోచన! 

దాగతి విధృతపదాగమాంత చర!

రాగ రహిత! శ్రీత్యాగరాజ నుత ॥ఏ॥

No comments:

Post a Comment