దుడుకు గల న న్నేదొర కొడుకు బ్రోచురా యెంతో దు..
కడు దుర్విషయాకృష్టుఁడై గడియ గడియకు నిండారు దు..
శ్రీవనితాహృత్కుముదాబ్జావాఙ్మానసగోచర దు..
సకలభూతములయందు నీవైయుండగ మదిలేకబోయిన దు..
చిరుత ప్రాయమునాఁడె భజనామృత రసవిహీన కుతర్కుఁడైన దు..
పర ధనములకొరకు నొరుల మదిని కరఁగ బలికి కడుపునింపఁ దిరిగినట్టి దు..
తన మదిని భువివి సౌఖ్యపు జీవనమే యనుచు సదా దినములు గడిపెడి దు..
తెలియని నటవిట శూద్రులు వనితలు స్వవశమౌటకుపదేశించి
సంతసిల్లి స్వరలయంబు లెఱుఁగకను
శిలాత్ములై సుభక్తులకు సమానమను దు..
దృష్టికి సారంబగు లలనాసదనార్భకసేనామిత ధనాదులను దేవ దేవ
నెరనమ్మితినిగాకను పదాబ్జ భజనంబు మరచిన దు..
చక్కని ముఖ కమలంబును సదా నా మదిలో స్మరణ
జేయక దుర్మదాంధ జనులఁ గోరి పరితాపములచే దగిలి
నొగిలి దుర్విషయదురాసలను రోయలేక సతత
మపరాధియై చపల చిత్తుఁడైన దు..
మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద
మందలేక మదమత్సరకామలోభమోహములకు దాసుఁడై
మోసబోతి గాక మొదటి కులజుఁడగుచు భువిని శూద్రుల
పనులుసల్పుచును యుంటినిగాక నరాధములను గోరిసార
హీనమతములను సాధింప తారుమారు దు..
సతులకై కొన్నాళ్లాస్తికై సురులకై కొన్నాళ్లు ధన
తతులకై దిరిగితినయ్య త్యాగరాజాప్త యిటువంటి దు..
No comments:
Post a Comment