Recorded Telugu translations
బంటురీతిఁ గొలు వీయవయ్య రామ ॥బం॥
తుంటవింటివాని మొదలైన మదా
దులఁ బట్టి నేలఁ గూలఁజేయు నిజ ॥బం॥
రోమాంచమనే ఘనకంచుకము
రామభక్తుడనే ముద్రబిళ్లయు
రామనామ మనే వరఖడ్గము వి
రాజిల్లనయ్య త్యాగరాజునికే ॥బం॥
No comments:
Post a Comment