కొలువై యున్నాడే కోదండపాణి ॥కొ॥
సలలితమతులై సారెకు శీలులై
వలచుచు కోరివచ్చి సేవింపఁగ ॥కొ॥
జనకజభరతాదులతో మంచి నైవేద్యంబుల
చనువున వేడుక నారగించి మెఱపుకోట్ల గేరు
కనకపటము సొమ్ములను ధరించి వేదోక్తమైన
సనకవచనములచే తోషించి శ్రితుల పోషించి ॥కొ॥
వరమగు వాసనలు పరిమళింప సన్నిధిలో వెలుఁగుచు
సురవారసతులు బాగ నటింప అదిగాక పరా
శరనారదమునులెల్ల నుతింప ఎంతెంతో నెనరున
సురపతి వాగీశులు సేవింప మేను పులకింప ॥కొ॥
ఉడు రాజముఖుఁడు శేషశయ్యపైని చెలంగగ గని
పుడమి కుమారి సుగంధము పూయ నమ్మినవారలకే
కడగంటిని కోరిన వరమీయ త్యాగరాజు నెనరున
అడుగడుగుకు మడువులనందీయ శ్రీరామయ్య ॥కొ॥
No comments:
Post a Comment