పండగ చేస్కోండి !!
జీవించడానికి ఇంతకన్న మంచికాలం లేదనడానికి పదిహేడు కారణాలు
"మ్యాట్ రిడ్లీ " భావాలకి అక్షర రూపమైన రీడర్స్ డైజెస్ట్ (ఏప్రిల్ 1992) వ్యాసానికి స్వేచ్ఛానువాదము.
" జీవించడానికి ఇంతకన్న మంచికాలం ఎన్నడూ లేదు ", అంటాడు సైన్స్ రచయిత మ్యాట్ రిడ్లీ " " పైగా అది ఇంకా ఇంకా మెరుగుపడుతోంది ". అయితే తరచూ వార్తల్లో వుండే ఆర్ధిక ఒడుదుడుకులు, వ్యాధులు, మాటలూ తూటాలతో మన యుద్ధాలు వంటి ఉపద్రవాలను చూసి గాభరాపడే విమర్శకులు మాత్రం, స్వేచ్ఛా వాణిజ్యం, పర్యావరణం వంటి సంక్లిష్ట విషయాలను తేలిగ్గా తీసుకొని చెప్పిన అతని మాటలను మిధ్యావాదం, పగటికలలు, లజ్జాకరం అని కొట్టి పారెయ్యడం పరిపాటి.
కానీ, ఈ మధ్యనే " హేతుబద్ధ ఆశావాది " అన్న పుస్తకం రాసిన 54 ఏళ్ళ రిడ్లీ మాత్రం, తన అభిప్రాయాలు మార్చుకోడు. " లోక సౌభాగ్యం గురించి కలలు కనడం తప్పా?" అంటాడు. ఒక అంతర్జాతీయ విలేకరిగా, జంతు శాస్త్రజ్ఞునిగా, ఆర్ధికవేత్తగా, పెట్టుబడిదారుగా విశేషానుభవం గల అతడు " లోకం మెరుగ్గా ఉంది, మెరుగుపడుతోంది అని నేను నమ్ముతాను. అది వెర్రిలా అనిపిస్తే అది వారిష్టం. నేనేం చెయ్యను. " అంటాడు. వెర్రో వివేకమో. మీరే చెప్పండి.
ఒకటి: మనం ఇప్పుడు ఎంతో మెరుగు.
యాభై ఏళ్ళక్రితం (అంటే నాకప్పుడు నాలుగేళ్ళు) కంటే, ఇప్పటి వారి వేతనాలు (ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన తరవాత) మూడు రెట్లు పెరిగాయి; ముప్ఫై శాతం అధిక కేలరీలు తింటున్నారు; పసి మరణాల సంఖ్య అరవై శాతం తగ్గింది; జీవన ప్రమాణం ముప్ఫై శాతం పెరిగింది. ప్రపంచం లోని ఏ ప్రాంతాన్ని తీసుకున్నా ఇప్పటికన్న మెరుగ్గా గతంలో లేదు - మొత్తం జనాభా రెండు రెట్లైనప్పటికీ.
రెండు: పట్నవాసం బహు బాగు
పల్లెవాసులతో పోలిస్తే పట్నవాసులు తక్కువ స్థలం ఆక్రమిస్తారు; తక్కువ విద్యుత్తు వినియోగిస్తారు; పర్యావరణం మీద వారి ప్రతికూల ప్రభావం తక్కువ. ప్రపంచ మొత్తం జనాభాలో సగం పట్నాల్లోనే ఉంది - కానీ వారు ఆక్రమించిన భూభాగం మూడు శాతం. పర్యావరణ ఉద్యమకారులకి పట్నవాసం అసహ్యమే గానీ పల్లెవాసం వారనుకుంటున్నంత పర్యావరణహితమేమీ కాదు. భూమిని రక్షించాలంటే మరిన్ని ఆకాశ హర్మ్యాల నిర్మాణం జరగాలి.
మూడు: పేదరికం అథఃపతనం
సంపన్నులు ఇంకా సంపన్నులవుతున్నారు, కాని పేదవారు పేదవారుగానే ఉండిపోవడం లేదు. 1980, 2000 సంవత్సరాల మధ్య పేదలు తమ వినియోగాన్ని రెట్టింపు చేశారు. యాభై యేళ్ళ క్రితంతో పోలిస్తే చైనావారు పది రెట్లు సంపన్నులయారు, పాతికేళ్ళు ఎక్కువకాలం జీవిస్తున్నారు. నైజీరియన్ లు రెట్టింపు సంపన్నులయారు, తొమ్మిది సంవత్సరాలు అధికంగా జీవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నవారి సంఖ్య సగానికి పడిపోయింది. ఐక్యరాజ్యసమితివారి లెక్కల ప్రకారం గత ఐదువందల యేళ్ళలో కన్న గడచిన అర్ధ శతాబ్దంలో తగ్గుముఖం పట్టిన పేదరికం శాతం ఎక్కువ.
నాలుగు: ముఖ్యావసరాల ధర సరసం
మెరుగుపడిన మన సంపదకి, ఆరోగ్యానికి, ఒడ్డూ పొడువులకి, తెలివితేటలకి, జీవనప్రమాణానికి, స్వేచ్ఛకీ ఒక కారణం, కూడు, గూడు, బట్ట, ఇంధనం వంటివి మునపటికన్నా చౌక కావడం. ఉదాహరణకి 1800 వ సంవత్సరంలో గంటసేపు వెలిగే కొవ్వొత్తి తయారీకి ఆరు గంటలు పట్టేది. 1880 లో, అంతే కాంతినిచ్చే కిరోసిన్ దీపం తయారీకి పదిహేను నిమిషాలు పట్టింది. 1950 లో అది ఎనిమిది సెకన్లయింది. నేడు అర సెకను. అంటే 1800 తో పోలిస్తే మన ఉత్పాదక సామర్ధ్యం 43,200 రెట్లు పెరిగింది.
ఐదు: పర్యావరణం మీరనుకుంటున్నంత పాడైపోవడం లేదు.
ఉదాహరణకి అమెరికాలో నదులు, సరస్సులు, సముద్రాలు, గాలి నిరంతరం శుద్ధి చెయ్యబడుతున్నాయి. స్టార్టు చేసి ఆపిన ఒక కారు 1970 లో కలిగించిన వాయుకాలుష్యం కన్న నేడు శరవేగంతో దూసుకుపోయే కారు కలిగించే కాలుష్యం బహు తక్కువ.
ఆరు: ఎక్కువ కొనుగోళ్ళు, కొంగ్రొత్త ఆవిష్కరణలు
కటిక పేదల్ని లెక్కలోకి తీసుకున్నా, మన ముందుతరం కన్న మన తరం అనుభవంలోకి ఎన్నో కేలరీలు, (విద్యుత్) వాట్లు, (మోటారు) అశ్వసామర్ధ్యం, (కంప్యూటర్) జిగాబైట్లు, (ప్రసార) మెగాహెర్త్జ్ లు, చదరపు అడుగులు, (విమాన) వాయు యోజనాలు, ఎకరాకు దిగుబడి, లీటర్ కు మైళ్ళు, ఇంకా బోల్డంత ధనమూ చేరేయి. మన వినియోగమూ ఉత్పాదనా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నందున ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఎన్ని కొత్త వింతలు సృష్టించి వాడుకుంటూ పంచుకుంటామో అంత ప్రయోజనం.
ఏడు: జీవనాన్ని మెరిపిస్తున్న ప్రపంచ వాణిజ్యం
ఉదయం తొమ్మిదికి నేనొక అమెరికా రేజర్ తో షేవ్ చేసుకుని తరవాత ఫ్రెంచ్ గోధుమతో తయారైన బ్రెడ్డు మీద న్యూజీలాండ్ వెన్న, స్పానిష్ మార్మలేడు పూసుకు తిని, భారత దేశపు నూలూ ఆస్ట్రేలియా వూలూ కలిపి నేసిన దుస్తులు, చైనా తోలూ మలేసియా సోలూ కలిపి కుట్టిన బూట్లు ధరించి, శ్రీలంక తేనీరు తాగుతూ ఫిన్లాండ్ కాగితం మీద చైనా సిరాతో ముద్రించిన న్యూస్ పేపర్ చదువుతాను. ఈ విధంగా వందలాది ప్రపంచ కార్మికుల శ్రమను కొద్ది కొద్దిగా రోజూ అనుభవిస్తాను. ప్రపంచ వర్తక వాణిజ్యాల కలయిక చేసిన చమత్కారం ఇది. మనమే చేసుకోవాలి మనవే మనం వాడాలి అనుకుంటే పేదరికమే.
ఎనిమిది: ఎక్కువ వ్యవసాయము = ఎక్కువ మరుభూములు
1900 సంవత్సరం నించి ప్రపంచ జనాభా నాలుగింతలవగా, అదే తరహా వృద్ధి మిగతావాటిలో కూడా జరిగింది - పంటభూములు ముప్ఫై శాతం, దిగుబడులు ఆరువందల శాతం పెరిగాయి. అదే సమయంలో, పట్నాలకు పరుగులు తీసిన వ్యవసాయదారులు వదిలిపెట్టిన సుమారు ఇరవై కోట్ల ఎకరాల బంజరు మొక్కా మోడూ చిగిర్చి అరణ్యమయి పర్యావరణ సంతులతని సాధిస్తోంది. దారుణమని అనుకుంటే అనుకోండి, నేనో ప్రకటన చేస్తాను: ఈ శతాబ్దం చివరికి, సాగుకోసం కొత్త భూమి చదునుచెయ్యనవసరం లేకుండా జనులందరికీ అత్యుత్తమ పోషకవిలువలున్న ఆహారం లభించగలదు.
తొమ్మిది : గతమంత ఘనమేమీ కాదు
పాతరోజుల్లో నిష్కాపట్యం, ప్రశాంతత, కలుపుగోలుతనం, ధార్మికత పరిఢవిల్లేవని, అవిప్పుడు లేవని కొందరి వాదన. ఈ గతవ్యామోహపు మెరుగులు సంపన్నులకి మాత్రమే. ఘనమైన గతంలోకి పోవాలని కోటలోవారు తప్ప పాకలోవారికనిపించదు. మూలాల్లోకి పోయి జీవించాలని ప్రాచుర్యంలోకి తెచ్చిన హిప్పీ సంస్కృతిని ఇప్పుడు చీకటి యుగంగా వర్ణిస్తున్నాం.
పది: పెరిగే జనాభా ప్రమాదం కాదు
జనాభా పెరుగుతోంది కాదనను, కాని పెరుగుదల రేటు గత యాభై ఏళ్ళగా తగ్గుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా, జాతీయ జననాల రేటు ప్రతి దశాబ్దానికీ తగ్గుతోంది, అభివృద్ధి చెందని దేశాల్లో అయితే, ఓ పక్క ఆయుః పరిమితి పెరుగుతున్నా, శిశుమరణాల సంఖ్య తగ్గుతున్నా కూడా, జనాభా వృద్ధి రేటు మాత్రం సగానికి పడిపోయింది. ఐక్యరాజ్యసమితి వారి లెక్కల ప్రకారం 2075 వ సంవత్సరంలో జనాభా 9.2 బిలియన్లైన తరవాత పెరుగుదల నిలిచిపోయి భూమి ఇక ఎప్పటికీ ఆహార సమస్యల్లేకుండా సాగుతుంది. ఇప్పటికే చూడండి. భూమ్మీద 7 బిలియన్ల మంది ఉన్నారు, దశాబ్దం దశాబ్దానికీ మెరుగవుతున్న మంచి ఆహారం తినగలుగుతున్నారు.

పదకొండు: చమురు నిల్వలు హరించుకుపోవడం లేదు
1970 లో ఐదు వందల యాభై బిలియన్ ల బ్యారెళ్ళు చమురు నిల్వలు ఉన్నాయని అంచనా కట్టేరు. దరిమిలా ఇరవై యేళ్ళలో ఆరు వందల బిలియన్ లు ఉదేశాం.
అంటే 1990 నాటికి యాభై బిలియన్ ల చమురు "ఎక్కువ" తాగీసినట్టన్న మాట. చిత్రంగా అది తొమ్మిది వందల బిలియన్లు ఉందని లెక్క కట్టేరు. అదీ, సౌదీ అరేబియా మొత్తం నిల్వల కన్నా ఇరవై రెట్లు అధిక చమురు కలిగిన తారు యిసకా చమురు మడ్డీ వంటి వనరుల్లో లభించే ఇంధనాన్ని మినహాయించి. చమురు, సహజ వాయువు, బొగ్గు వంటివి పరిమితమే. కానీ వాటితో మరికొన్ని దశాబ్దాలో శతాబ్దాలో సర్దుకోవచ్చు. అవి హరించుకుపోవడానికి ముందే ప్రత్యామ్నాయాలు సిద్ధమైపోతాయి.
పన్నెండు : మన తరం చాలా అదృష్టవంతులం
చరిత్రలో ఎన్నడూ ఎరగని అధిక మొత్తంలో శాంతి, స్వేచ్ఛ, ఖాళీ సమయం, విద్యావకాశాలు, వైద్య సౌకర్యం, పర్యాటక సమయం పొందే భాగ్యం కలిగింది ఈ తరానికి. కానీ అవకాశం దొరికినప్పుడల్లా ముఖాలు వేలాడేసుకుని విషాదగీతాలు ఆలపిస్తారు. కన్నులు మిరిమిట్లు గొలిపే విస్తృతమైన వస్తు శ్రేణిని చూసి వినియోగదారులు "బెంబేలెత్తిపోతున్నారు" అంటారు "మనస్తత్వ నిపుణులు". కానీ మా ఇంటి దగ్గరున్న సూపర్ మార్కెట్ లో ఎప్పుడు చూసినా బెంబేలెత్తిపోయినవారు కనబడలేదు. సమృద్ధంగా ఉన్న కొత్త కొత్త వస్తువుల్లో నచ్చినవి ఎంచుకుంటున్నారంతే.
పదమూడు: ప్రకృతి విపత్తుల నష్టం పెరగడం లేదు
అస్సలు లేదు. పోయిన శతాబ్దంలో భూతాపం పెరిగినమాట వాస్తవమే కానీ తుపానులు, సుడిగాలులు తగ్గేయి. మొత్తం జనాభాలో ప్రకృతి విలయాల వల్ల మరణించిన వారి శాతం, 1920 ప్రాంతాల్లోని శాతంతో పోలిస్తే, తొంభై శాతానికి పైగా తగ్గింది.
పెను సుడిగాలుల మారణ శక్తి వాయుగతి కన్నా మిన్నగా ధన స్థితిని బట్టి వుంటుంది. 2007 లో అతి ప్రచండమైన పెను తుపాను మెక్సికోలో అప్రమత్తమై సర్వ సన్నద్ధమైన యుకాటన్ ప్రాంతాన్ని కకావికలం చేసింది కానీ ఒక్కరూ చనిపోలేదు. మరుసటి యేడు, అంతే తీవ్రత గల ఉత్పాతం పేదరికం కారణంగా తగిన చర్యలు తీసుకోలేకపోయిన బర్మా దేశాన్ని కుదిపేసి రెండు లక్షల మందిని బలిగొంది. స్వేచ్ఛ, సంపదలే విపత్తులనుండి ఎక్కువ రక్షణనిచ్చేవి.
పధ్నాలుగు : భావనాశక్తికి అంతులేదు
అభివృద్ధి చెందుతున్న కొద్దీ మరింత అభివృద్ధి చెందగలుగుతాం. ఆవిష్కరణలు చేస్తున్నకొద్దీ కొంగ్రొత్త ఆవిష్కరణలు చెయ్యగలుగుతాం. వస్తువులకి క్రమ క్షీణోపాంత సూత్రం వర్తిస్తుంది కానీ మన ఊహాశక్తికి కాదు. నిరంతరాయంగా ఇచ్చిపుచ్చుకునే ఊహాసంపద ధగద్ధగాయమానమైన సృజనాత్మతకి బాటలు పరిచి ఎన్నెన్నో వినూత్నమైన ఆష్కరణలకి దోహదపడుతుంది. మన భావనలు, ఆవిష్కరణలు, కల్పనా సామర్ధ్యం ఎప్పుడు ఆగిపోతాయో లెక్కకట్టి చెప్పగల ధీశాలి ఇంతవరకు పుట్టలేదు.
పదిహేను : మన సమస్యలనన్నిటినీ మనం పరిష్కరించుకోగలం
ప్రపంచం బాగుంది, ఇంకా బాగుంటుందర్రా అంటే వీడికి వెర్రేమో అంటారు. త్వరలోనే మహా విపత్తు విరుచుకుపడబోతోందహో అంటే నోబెల్ బహుమతి సిద్ధం. పుస్తకాల దుకాణాలు నైరాశ్యంతో నిండిపోయాయి. ప్రసారసాధనాలు కీడునీ గందరగోళాన్నీ ఎడతెగకుండా మోస్తూనేవుంటాయి. ఆర్ధికాభివృద్ధి ఆగితేనే ప్రపంచం దక్కుతుందనే ఉపదేశం నాకు వినబడని రోజు లేదు. కాని ప్రపంచం ఒకే రకంగా ఉండిపోదు. మానవజాతి తన సమస్యలను తానే పరిష్కరించుకోగలిగిన శక్తిని సంపాదించింది. ఎదురైన సమస్యను ఎదుర్కోవడం కుదరకపోతే తన మార్గాన్ని మళ్ళించుకునైనా దాటిపోగలదు. అసలు ప్రమాదం ఆ మళ్ళింపులో అడ్డుపడే అవరోధాల నించే.
పదహారు: ఈ ఆర్ధికమాంద్యం అంత మందం కాదు
1930 ల నాటి ఆర్ధికమాంద్యం అభివృద్ధి మార్గంలో అడ్డుపడ్డ చిన్న కంచె. 1939 వచ్చేసరికి అత్యంత ప్రతికూల ప్రభావం పడిన అమెరికా జర్మనీలు కూడా 1930 నాటి కన్నా సంపన్నమయాయి. కనీవినీ ఎరుగని కొంగ్రొత్త ఆవిష్కరణలు ఆ మాంద్యంలో జరిగేయి. కనుక ఎవో తప్పుడు విధానాలూ మొండితనమూ అడ్డుపడితే తప్ప వృద్ధి ఆగదు. ఎక్కడో, ఎవరో, ఒక సాఫ్ట్ వేర్ తోనో, లోహ మిశ్రమంతోనో, జీవకణాలతోనో కుస్తీ పడుతూనే వుంటారు - మన జీవితాన్ని యింకా సుందరమూ సుమధురమూ చేసేందుకు.
పదిహేడు : ఆశావాదులే యోగ్యులు
రెండువందల యేళ్ళుగా నిరాశావాదమే రాజ్యమేలింది. ఎక్కువ సందర్భాల్లో ఆశావాదమే నెగ్గినప్పటికీ. సంగతేమిటంటే నిరాశావాదంలో పెట్టుబడి ఎక్కువ. అంతా బాగుంది, బాగుంటుంది అంటే విరాళాలు రాలవు. భయపడుతున్నంత ప్రమాదం ఏమీ లేదనీ కారణాలు ఉదహరిస్తూ రాసిన విలేకరి వార్త మొదటి పేజీలో పడదు. గాభరా గుంపులూ ఒత్తిడి బృందాలూ వారి సమాచార సన్నిహితులూ ఊహాకల్పిత ఉత్పాతాల చెత్తకుప్పల్ని కొక్కిరిస్తూ ఆకర్షణీయ గణాంకాలు అల్లి పంచిపెడతారు. పట్టించుకోకండి. ధైర్యంగా ఆశావాదులుగా వుండండి.

No comments:
Post a Comment