Monday, October 4, 2021


ప్రార్ధన పనికొచ్చేదేనా 

డాక్టర్ ల్యారీ డోసీ రచన 

నేను టెక్సాస్ పార్క్‌ల్యాండ్ మెమోరియల్ ఆసుపత్రిలో ట్రెయినీ గా ఉన్నప్పుడు మొదటి పేషంటును అప్పజెప్పారు.  అతని రెండు ఊపిరితిత్తులూ చెడిపోయిన క్యాన్సర్ పేషంటు.  ఆఖరి దశలో ఉన్నాడు.  ఎదో చెయ్యాలి కదాని చెయ్యదగ్గ  ఒకటి రెండు థెరపీలు వివరించే ప్రయత్నం చేసేను.  కొన ఊపిరితోనే ఉన్నా మాట వినగలిగిన అతను నీరసమైన గొంతుతో ఇంకేవీ ఒద్దని ప్రాధేయపడ్డాడు.    నా మనసులోని అభిప్రాయమూ ఇదే.   

తరవాత అటుగా పోతో యధాలాపంగా అతని బెడ్డు వైపు చూచినప్పుడు కొందరు స్నేహితులు చుట్టూ కూచుని ఏవో భజన గీతాలు భక్తి పాటలూ ఆలపిస్తుండేవారు.  మంచిది మంచిది అన్నాను వారిని చూస్తూ.  తరవాత శవం దగ్గర చెయ్యాల్సిందే కద ఇప్పణ్ణించే చేస్తే అలవాటవుతుంది లెండి అనుకుంటూ.  

ట్రెయినింగు పూర్తయి ఇంకో చోట ప్రాక్టీసు ఆరంభించాను.  ఒక రోజో పాత మిత్రున్నించి ఫోను వచ్చింది.  నీ మొదటి పేషంటుటయ్యా పార్క్‌ల్యాండు  నించి.  చూచేందుకొస్తావా అనడుగుతున్నాడు.  అన్నాడు. 

చూడటమా? అన్నాను.  అతనింకా బతికే ఉన్నాడా అని మనసులోనే అనుకుని చూచేందుకు వెళ్ళేను.

నన్ను చూచి పేషంటు ఆనందించేడు.  నేనతని చెస్టు ఎక్స్ రేస్ పరీక్షించాను.  అవి అతి మామూలుగా ఉన్నయి. క్యాన్సర్ సూచనలే వాటిలో అగపడలేదు.  నన్ను గుర్తు పట్టిన రేడియాలజిస్టు అన్నాడు.  మొత్తానికి మంచి థెరపీనే చెప్పేరండీ అన్నాడు.   థెరపీనా నేనేదీ చెప్పలేదే.  ప్రార్ధనలనా అతని ఉద్దేశం.

మా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లిద్దరికి చెప్పేను కాని ఇదో వైద్య అద్భుతం మిరకిల్ అని వారంగీకరించలేదు.   అద్భుతమేదీ లేదు, అది సహజమే అన్నారు వారిలో ఒకరు.  చూద్దాం లే అని అప్పటికి సంభాషణ చాలించేరు.

చిన్నప్పుడు నలుగురితో పాటూ నాకూ భక్తి ఉండేది కాని ప్రయత్నపూర్వకంగా దాన్ని వదిలిపెట్టాను.  ఇప్పుడు నేను ఆధునిక వైద్యశాస్త్ర శక్తిసామర్ధ్యాలనే నమ్ముకున్నాను.  అటువంటి నాకు ప్రార్ధన ఒక థెరపీ అనో మరే చికిత్సా విధానమనో అనుకునేందుకే ఎబ్బెట్టుగా ఉంటుంది.  ఈ ఉదంతాన్ని మనసులోనిచి చెరిపివేసేను.  

యేళ్ళు గడిచి నేనో పెద్ద నగర ఆసుపత్రికి అధిపతినయ్యాను.  నావద్దకొచ్చే రోగుల్లో చాలామంది క్రమబద్ధంగా ప్రార్ధనలు చేసేవారే.  అది వారి వ్యక్తిగతం, అందులో జోక్యం చేసుకునే ఉద్దేశమూ నాకు లేదు.  

ఇదిలా ఉండగా ఎనభైల్లో ఈ అంశం మీద వైద్య రంగం నిర్వహించిన కొన్ని ప్రయోగాల గురించిన వ్యాసాలు చదవేను.  వాటి ప్రకారం ప్రార్ధనకి ఎన్నో రుగ్మతలను నయం చేసే శక్తి ఉంటుంది.  వాటన్నిటిలో ఎనభై ఎనిమిదిలో ప్రచురితమైన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ రాండాల్ఫ్ బెయిర్డ్ గారి వ్యాసం నన్నెంతో ఆకర్షించింది.  తమ ప్రయోగంలో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కో జనరల్ హాస్పిటల్ కరోనరీ కేర్ విభాగం వారు మూడు వందలమంది హృద్రోగుల వివరాలు కంప్యూటరుకెక్కించారు.  వీరిలో కొందమంది పేర్లను ప్రార్ధించే బృందాలకిచ్చారు వారికై ప్రార్ధించమని.  ఏ రోగి ఏ గ్రూపులో ఉన్నాడో ఎవరికీ తెలీదు.   ప్రార్ధనా బృందాలకి ఇచ్చిన జాబితాలో రోగుల మొదటి పేరు, క్లుప్తంగా వరి వ్యాధి వివరాలూ పొందుపర్చారు.  పేషంట్లు డిస్చార్జి అయేంతవరకు ప్రతిరోజూ వారిగురించి ప్రార్ధించమని వారికి చెప్పారు.  మీకెలా తోస్తే అలా ప్రార్ధించండన్నారు.  పది నెల్ల తరవాత అధ్యయనం ముగిసేసరికి ప్రార్ధించబడ్డ రోగుల ఆరోగ్యం ఎన్నో విధాలుగా మెరుగుపడింది.  వారి ఆరోగ్య స్థితి ప్రార్ధించబడని వారికన్న ఐదు రెట్లు ఎక్కువ మెరుగ్గా ఉండి, చికిత్సానంతర యాంటీబయోటిక్స్ ఏవీ వారు వాడనవసరం లేకపోయింది. 

ప్రార్ధించబడని వారికన్న వారికి కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ సంభవించే అవకాశం ఇరవయ్ ఒక్క శాతం తగ్గింది.  కార్డియాక్ అరెస్ట్ అవకాశాలూ వారి విషయంలో అతి తక్కువ కనిపించేయి.  ఇక్కడ వినియోగించింది ప్రార్ధన కాక వేరే ఔషధమేదన్నా అయితే అదో విద్యశాస్త్ర అద్భుతావిష్కరణగా మన్ననలు అందుకునేది.  ఈ ఫలితాలు అధ్యయనం చేసిన వారిలో డాక్టర్ విలియం నోలన్ ఒకరు.  అతను నాస్తికులు.  "ఇకమీదట మనం ప్రిస్క్రిప్షన్ లో మూడు ప్రార్ధనలు పూట కొకటి చొప్పున.  పనిచేస్తే చేస్తుంది" అని రాయాలేమోనండోయ్ అన్నారే కాని ఫలితాలను కొట్టి పారెయ్యలేదు.

శాస్త్రవేత్తలకీ వైద్యులకీ blind spots - అదంటూ ఒకటుందని - తెలీని విషయాలు ఉండుంటాయి.  ప్రార్ధనకున్న శక్తీ అందులో ఒకటై ఉంటుంది.  

నేను చాలాఆలమై డాక్టరు ప్రాక్టీసు మానేసి ఆరోగ్యం మీద ప్రార్ధన ప్రభావాన్ని గురించిన పరిశోధనలు కొనసాగిస్తున్నాను.  అధిక రక్త పోటు, గాయాలు త్వరగా మానేందుకు, తలనొప్పి ఆందోళన వంటి రుగ్మతలకు ప్రార్ధన ఒక సమర్ధవంతమైన థెరపీగా పనిచెయ్యగలదని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.  

నా అధ్యయనంలో నేను గమనించినవి:  ప్రార్ధన ఎన్నో రకాలుగా చేపట్టవచ్చు.  ఏదో కోరి చేసినవే కాక ఏదీ కోరక చేసినవీ పనిచేసేవే.  అంటే అభీష్ట సిద్ధిరస్తు దై విల్ బి డన్ అనే అతి సామాన్య ప్రార్ధనా పనిచేస్తుంది.

అసలు మనసులో ఏదీ అనుకోకుండా, మనసు నిర్మలం చేసుకుని దాన్ని దయ, కృతజ్ఞత, సౌహార్దం వంటి భావనలతో నింపి మొనంగా కూచున్నా అదీ ప్రభావశీలమైన ప్రార్ధనే.   ప్రేమ నిండిన ప్రార్ధన ప్రభావం మరింత ఇనుమడిస్తుంది.  ప్రేమ ప్రభావం చిరకాలంగా మనమెరిగినదే.  ప్రేమ కోసం ఏదైనా చెయ్యగల స్థైర్యం ప్రేమికుల్లో చూస్తాం.  శారీరకంగా చూచుకున్నా ప్రేమ భావనలు నిండినప్పుడు బుగ్గలు ఎర్రబడటం గుండె కొట్టుకోవడం వంటివి అందరికీ తెలిసినదే.  ఎన్నో దీర్ఘ రోగాలు నయం చెయ్యగలదిగా ప్రేమకు అనాదిగా పేరూ అనుభవమూ ఉన్నాయి.  అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ హృద్రోగులైన పదివేల మంది మీద జరిపిన అధ్యయనంలో యాంజీనా అంటే గుండె నొప్పి సంభవించే అవకాశాలు అతి తక్కువగా ఉన్నట్టు కనుగొన్న యాభై శాతం మందీ తమకి జీవితంలో లభించిన అతి విలువైన సంపద తమ జీవిత భాగస్వామి ప్రేమాభిమానాలే అని పేర్కొన్నారు.   విశ్వాసాన్నీ ప్రార్దననూ చికిత్సా సాధనంగా చేసుకున్న అందరూ ఇది అంగీకరిస్తారు.   ప్రేమ చికిత్సలో రోగీ వైద్యుడూ ఒక దగ్గరే ఉండాలని లేదు.  ప్రేమ తత్వంలో మనస్ఫూర్తిగా వెల్లడించే అభయమూ ఆర్ద్రతా భరోసా వంటి భావనలు ఇద్దరిదీ ఒకే దేహం ఒకే ఆత్మ అన్నంతగా ప్రార్ధన చెయ్యబడేవారిని చికిత్సకులకు దగ్గర చేస్తాయి.  భౌతిక ఎడబాటుతో నిమిత్తంలేకుండా.   చికిత్సకి స్వస్థపరిచే శక్తిని ప్రసాదించేది ప్రేమే అంటారు పేరెన్నిక గన్న చికిత్సకురాలు ఏగ్నెస్ శాన్‌ఫోర్డ్.  

ప్రార్ధనలు నిద్రపోవు.  నా చిన్నతనంలో తరచూ పెద్దలనించి వినే ఉపదేశం, నిర్విరామంగా ప్రార్ధిస్తూనే ఉండాలి అని.   పెద్దయాక నిర్విరామం అంటే అర్ధం తెలిసింది.  ఆపకుండా అని.  అయితే ఎంత ప్రయత్నించినా మహా అయితే రాత్రి మంచమెక్కేవరకే కుదిరేది కాని నిద్రలోకి జారుకున్నాక ప్రవాహానికి అడ్డుకట్ట పడినట్టనిపించేది.  దేహం నిద్రిస్తున్నా నిత్య చైతన్యమై ఉండే అంతశ్చేతన ద్వారా ప్రార్ధన సాధ్యమని ఎప్పుడూ అనుకోలేదు.  ఈనాడు ప్రార్ధన అంటే జాగరూకులమై ఉన్నప్పుడు ఆచరించే ధ్యాన ప్రక్రియ అని.  కాని జాగరూకులమై లేని నిద్రావస్థలో, స్వప్నావస్థలో కూడా ప్రార్ధన సాధ్యమని కాని, ఆ మాటకొస్తే మన అంతశ్చేతన చేసే ప్రార్ధనే జాగ్రదవస్థలో చేసే ప్రార్ధన కన్న ఎంతో ప్రగాఢమూ నిశ్చలమూ అని అంగీకరించేందుకు అనుభవం అవసరం.   

ప్రార్ధన, ధ్యానాల ఆరోగ్య ప్రయోజనాల మీద విశేష అధ్యయనం చేసిన తొలితరం వైద్య నిపుణుల్లో హార్వర్డ్ మెడికల్ స్కూలుకు చెందిన డాక్టర్ హెర్బర్ట్ బెన్సన్ ఒకరు.  వారి ప్రకారం, ఒక మతధర్మానిదనే కాక అన్ని మతాల ప్రార్ధనలూ ప్రభావశీలమైనవే.  శారీరక వ్యాయామానికీ ప్రార్ధన ఉపకరిస్తుందని తన పరిశోధనలో వెల్లడించారు.  ఇందుకోసం పరుగులో పాల్గొన్న వారిలో కొందరిని మనసులో ప్రార్ధిస్తూ ప్రరుగెత్తమన్నారు.  వారంతా మిగతావారికన్న మిన్నగా లంఘించారు.  అయితే సార్వజనీన ప్రార్ధనా ప్రక్రియంటూ ఏదీ లేదు.  అందుకని ఇలాగే చెయ్యండి అని రాసిస్తే ఆరంభంలో ఆచరించినా అతి త్వరలో ఆపెసే వారి సంఖ్య అధికమువుతుంది.   

ప్రార్ధించే అలవాటున్నవారందరికీ తాము కోరి చేసే ప్రార్ధనలు ఫలిస్తాయని అనుభవమే.  అయితే పరిశోధనల్లో తేలినది, ఏదీ కోరక చేసే ప్రార్ధనలూ అంతే ప్రభావవంతమైనవని.  ఉదాహరణకి, thy will be done - అభీష్ట సిద్ధిరస్తు, may the best thing happen - సన్మంగళాని భవంతు అంటూ చేసేవి మానావాళికంతకూ శుభం కోరేవీ, ఏ ఒక్క వ్యక్తికో కోరికకో పరిమితం కానివీ అయినా ప్రభావవంతమైనవే.  హృదయమే ప్రధానం.  ఇంగ్లీషులో అంటుంటారు లెట్ గో అండ్ లెట్ గాడ్ అని.  అంటే పనిమట్టుకు మనది, ఫలితం పైవానిది.  

ప్రార్ధన అంటే మనం ఒంటరి కామని.   నా పేషంట్లలో ఒకరికి మృత్యువు ఆసన్నమైంది.  నేను అప్పుడప్పుడు అతని బెడ్ పక్క నించునేవాడిని.  ఇంకో పక్క కుటుంబ సభ్యులుండేవారు.  అతనికి ప్రార్ధనలంటే విశ్వాసం లేదని, ఎప్పుడూ చేసినవాడూ కాడని అందరూ ఎరుగుదురు.  అయితే చివరి రోజుల్లో క్రమం తప్పక ప్రార్ధించేవాడు.  ఇప్పుడీ కొత్త అలవాటేమిటని అడిగితే, ఎవరో వచ్చి నన్ను బతికిస్తారని కాదు కాని ప్రార్ధిస్తున్నప్పుడు నేను ఒంటరిని కాను అనిపిస్తుంది.  అదో కొంత ధైర్యం అంటాడతను.  

అదే ప్రార్ధన స్వభావం.  మన బంధనాలకూ స్థల సమయాలకూ అతీతమై మనను స్వేఛ్ఛగా విహరించనిచ్చే  ఒక మహా విశ్వచైతన్యం మనకి ఆసరాగా ఉందని, అది అనుభవంలోకి రావాలంటే నిశ్చలమైన ప్రార్ధన ఒక్కటే మార్గమని, మనం ఒంటరివారం కామని భరోసా ఇచ్చేది.     

విశ్వాసం ఒక దివ్యౌషధం 

రచయిత ఫిలిస్ మకింతోష్

పని మీద ధ్యానం అనే వాక్యాన్ని అక్షరాలా ఆచరిస్తారు, లాస్ ఏంజెల్స్లోని స్టీఫెన్ ఎస్ వైజ్ ఆలయంలో ప్రతివారం కూడే ఒక మహిళా భక్త బృందం.  ప్రతి వారం వారు ఆలయ ఆవరణలో బాడీ అండ్ సోల్ అంటే దేహాత్మల సంయోగమా అన్నట్టు జాగింగూ ధ్యానమూ కలిసి చేస్తారు తమ యూదు మతానుసారం.  వారిలో నర్సుగా పనిచేస్తున్న రాబెర్టా స్క్విజర్ ప్రకారం, ధ్యానంతో కలిసి చేసే తన శరీరపు ప్రతి కదలికా అలౌకిక ప్రశాంతనిస్తుందంటుందామె.   ఇది గ్రహించిన స్క్విజర్ తన అసిస్టెంట్ ప్రొఫెసర్తో కలిసి ఆర్థ్రిటిస్ రోగులకు నిర్దేశించే వ్యాయామ తెరపీలో భాగంగా శరీర కదలికలతో పాటు ధ్యానాన్నీ చేయించి చూచేరు.  ఇతర రకాల అనారోగ్యాలతో ఇబ్బందిపడేవారికీ చికిత్సగా ఆధ్యాత్మికతను ఆచరించే శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేసేరు.  

ఆధ్యాత్మిక విశ్వాసం దేహానికీ ఆరోగ్యకరమనే యోచన కొత్తది కాదు.  ఎన్నో సందర్భాల్లో బతకడమూ నయం కావడం ఇక అసంభవం అని వైద్యులు తేల్చేసిన రోగులెంతమందో బతికేరు, స్వస్థులయేరు.  అయితే కొత్తదేమంటే, ఇన్నాళ్ళూ ఆధ్యాత్మికతతో ఎడమొహం పెడమొహంగా ఉన్న సైన్సు దాన్ని అక్కున చేర్చుకుంటోంది.  

వాషింగ్టన్ లోని జార్జిటవున్ ఊనివర్సిటీలో ఎసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ అయిన డాక్టర్ డేల్ మాథ్యూస్ అంటారు: దేవుడు జబ్బులు నయం చేసినట్టు నిరూపించలేము కాని దైవ విశ్వాసానికి ఆ శక్తి ఉందని నిరూపించే ఉదాహరణలు లెక్కలేనన్ని అని.   

ఆరోగ్యకరమైన మత విశ్వాసం దేహారోగ్యాన్నీ ప్రసాదిస్తుందన్నది నిస్సందేహం.  అయితే అది ఎంత వరకు ప్రభావ వంతమూ అని సుమారు ముప్ఫై అధ్యయనాలు చేపట్టి క్రమబద్ధమైన ఆధ్యాత్మికత కలిగినవారు దీర్ఘ కాలం జీవిస్తారని తేలింది.  కాలిఫోర్నియా లో క్రమం తప్పకుండా చర్చికి హాజరయే అయిదువేలమందిని అధ్యయనం చేసినప్పుడు వారికున్న ధూమపానం, మద్యపానం, స్థూలకాయం, వ్యాయామం లేకపోవడం వంటి అలవాట్లకతీతంగా వారందరికీ ఎటువంటి అనారోగ్యాల బారినపడే అవకాశాలూ మిగతా వారితో పోలిస్తే అతి తక్కువ అని నిర్ధారణ అయింది.  నియమం తప్పకుండా మతాచారాలు పాటించే  ప్రతి ఎనిమిది మంది క్యాన్సర్ రోగుల్లో ఏడుగురు, ఐదుగురు రక్తపోటు వ్యాధిగ్రస్తుల్లో నలుగురు, ఆర్గురు హృద్రోగుల్లోను నలుగురు, అయిదుగురు సాధారణ ఆరోగ్య సమస్యలున్నవారిలో నలుగురు ఆయా అనారోగ్యాలను జయించగలిగేరని కనుగొన్నారు.  అలాగే సడలని విశ్వాసం కలిగినవారు డిప్రెషన్, ఆత్మహత్యాప్రవృత్తి, మద్యపాన బానిసత్వం వంటి జాడ్యాల నించి అతి త్వరగా కోలుకుంటారని తెలిసింది.  ఇది జాతి, మత, లింగ భేదాలు లేకండా మనుషులందరికీ వర్తించే విశ్వజనీన సత్యం.   

ఈస్ట్రన్ వర్జీనియా మెడికల్ స్కూలుకు చెందిన ప్రొఫెసర్ జెఫ్రీ లెవిన్ కూడా ప్రార్ధనకీ ఆరోగ్యానికీ ఉన్న సన్నిహిత సంబంధాన్ని ధృవపరుస్తాడు.  అతని అధ్యయనంలో అన్నిరకాల మతాలకు చెందినవారూ పెద్దలూ పిన్నలూ కూడా ఉన్నారు.  

అయితే ప్రార్ధన ఎలా పనిచేస్తుందని పరిశోధించిన నిపుణులు ఈ విధంగా అంటారు.  ధార్మిక సమూహాల్లో పాల్గొన్నప్పుడు సమాజంలోని ఇతరులతో కలిసి పనిచేస్తాం.  మంచి సామాజిక బంధాలు ధైర్యాన్నీ సాంత్వననీ అభిప్రాయాల మార్పిడినీ పరస్పర సహకారాన్నీ పెంపొందిస్తాయన్నది తెలిసినదే.  విశ్వాసం ఒక ఆశావహ దృక్పథాన్ని కలిగించి ఒత్తిడిని తగ్గిస్తుంది.  మత ధర్మాచరణకి కట్టుబడి తదనుగుణంగా ఆచరించేవారు దీర్ఘ కాలిక రోగాలూ తదనంతర దుష్ఫ్రభావాలనూ తేలిగ్గా ఎదుర్కొనగలుగుతారు అంటారు, డ్యూక్ యూనివర్సిటీ లోని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ రెలిజియన్ డైరెక్టర్ డాక్టర్ హెరాల్డ్ క్విన్.    

రక్త ప్రసార, జీవ క్రియ వ్యవస్థలను రిలాక్సేషన్ రెస్పాన్స్ అనే థెరపీ ఏ విధంగా చక్కదిద్దుతుందో అదే విధమైన ఫలితాన్ని ప్రార్ధన నించీ పొందవచ్చునని నిర్ధారించారు, డాక్టర్ హెర్బర్ట్ బెన్సన్.  జపమాల తిప్పడం, ఒక పవిత్రనామాన్నో మంత్రాన్నో ధానిస్తూ పునశ్చరించడం, మనసు దానికి దూరంగా జరిగిపోతున్నప్పుడు వెనక్కి లాక్కొచ్చి మాళ్ళీ పునశ్చరణ మీద కేంద్రీకరించడం ఇవి కూడా ఊ ఒక విధమైన రిలాక్సేషన్ రెస్పాన్స్ వంటి ప్రభావ సమన్వితాలే.   ఇటువంటి పునశ్చరణ ప్రక్రియకి భగవద్భక్తీ తోడైనప్పుడు ప్రయోజనం మరింతగా ఉంటుందంటారు డాక్టర్ బెన్సన్.

ఇంకో పరిశోధకుల బృందం ఇతరుల ప్రార్ధనలు పనిచేస్తాయా అన్నదాన్ని అధ్యయనం చేస్తున్నారు.  బెన్సన్ బృందం కరోనరీ బైపాస్ రోగులనూ మథ్యూస్ బృఅందం ర్యుమటాఇడ్ ఆర్త్రిటొఇస్ రోగులను ఎంచుకుని 1988 లో కార్డియాలజిస్టు డాక్టర్ రాండాల్ఫ్ బెయిర్డ్ పరిశోధనా పత్రంలోని వెల్లడించిన విషయాల ఆధారంగా.  బెయిర్డ్ 393 మంది హార్టు పేషంట్లను తీసుకుని వారిలో కొందరికై ప్రార్ధనలు చేయించి ఇంకొందరిని అలానే వదిలిపెట్టాడు.   తమ గురించి జరుగుతున్న, జరగని ప్రార్ధనల విషయం పేషంట్లెవరికీ తెలీదు.  అయితే అనుకున్న వ్యవధి తరవాత ప్రార్ధించబడ్డ రోగుల్లో చికిత్సానంతర ఇబ్బందులు, న్యుమోనియా, గుండెపోటు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్లు వంటివి మాయమై యాంటీ బయాటిక్సూ ఇతర మందులూ వాడనవసరం లేకపోయింది.  

ఇంకో అడుగు ముందుకేసి ప్రయోగశాలల్లో ఎలకల శరీరాల్లో బాక్టీరియా పెంపక, గాయాల నయం వాటిమీద కూడా ప్రార్ధనల ప్రభావాన్ని అధ్యయనం చేసేరు.  క్షుద్ర ప్రాణుల పైన జరిపిన ఈ పరిశోధనల ఫలితాలూ విస్మయ పరిచే అంశాలు వెల్లడించేయని నిర్ధారించారు, డాక్టరు ల్యారీ డోసీ.  అతను "ప్రార్ధన పరమౌషధం" ప్రేయర్ ఈజ్ గుడ్ మెడిసిన్ అనే పుస్తకం రచించారు.   

డాక్టర్ డాసీకి ప్రార్ధనాశక్తి ప్రభావం మీద ఎంత నమ్మకం కలిగిందంటే, స్వయంగా అతనే రహస్యంగా తన పేషంట్ల కోసం ప్రార్ధించేవారు.  అయితే ఈ విధానం విషయంలో కాస్త ఆచి తూచి ముందుకెళ్ళాలని ఆయన సూచించారు.  వైద్యులం వేదాంతాన్ని ప్రబోధించరాదు.  ఇది ఆచరించాలా వద్దా అనేది ఆయా వైద్యుల, రోగుల వ్యక్తిగత నిర్ణయానికి వదిలిపెట్టాలి అని అభిప్రాయపడ్డారు.  

అయితే వైద్య పరిశోధనా సంస్థలు మాత్రం ఆరోగ్యానికీ ఆధ్యాత్మికతకీ ఉన్న సంబంధం మీద మరిన్ని లోతైన పరిశోధనలకి పూనుకున్నాయి.  హార్వర్డు మెడికల్ స్కూలు, మేయో క్లినిక్ వంటివి ఆధ్యాత్మిక, ఆరోగ్య సదస్సులు నిర్వహించాయి.  ఇంచుముంచు సగం అమెరికన్ మెడికల్ స్కూళ్ళు ఈ విషయాన్ని ఒక పాఠ్యాంశంగా కూడా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.  

ఇంకో అధ్యయనంలో వందమంది ఫిజీషియన్ల వ్యక్తిగత అభిప్రాయాలు సేకరించారు.  వారిలో తొంభై తొమ్మిది మంది చికిత్సలో ప్రార్ధన కూడా చేర్చే ప్రతిపాదనను ప్రోత్సహించారు.  అరవై యేడు మందైతే తమ ఆరోగ్యం విషయంలో భగవంతుడే స్వయంగా జోక్యం చేసుకుని నయం చేసేడని కూడా అభిప్రాయపడ్డారు.  

టైమ్స్  సీ యెన్నెన్, యూ ఎస్ యే వీకెండ్ పత్రికలూ ఈ విషయమై విస్తృతంగా అభిప్రాయ సేకరణ చేసి వైద్యులు తమ రోగులకు ప్రార్ధన శక్తి గురించి కూడా వివరించి ఆసక్తి చూపే వారి కోసం ప్రార్ధనలు నిర్వహించడం, చెయ్యడమూ చేపడితే నష్టం లేదని వెల్లడించేయి.      

ఆరోగ్యమూ ఆధ్యాత్మికతల అవినాభావ సంబంధం పట్ల ఇంత ఆసక్తి పెరగడానిక్కారణం, రాను రాను ఆరోగ్య వ్యవస్థను తొందర తొందర తరుముడూ యాంత్రికతా నడిపిస్తున్నాయి.  రోగినో వస్తువులా భావించే వైద్య గడియారపు లోలకం పూర్తి భౌతికమై, స్వాస్థ్యానికి శరీరాన్ని పరిగణిస్తే చాలన్న భావనవైపుకి జరిగిపోయి అతి ముఖ్యమైన అంతరంగ, ఆధ్యాత్మిక దిశను పూర్తిగా విస్మరించింది. ఈ పాక్షిక ఊగుదల గడియారానికి మంచిది కాదు కనక లోలకాన్ని అటువైపూ ఊగేలా చేసే ప్రయత్నాలే ఇవన్నీ అంటారు డాక్టర్ డోసీ.  

అయితే ఆరోగ్య సాధనంగా పూజా పునస్కారాలు సూచిస్తే పనిచెయ్యదు.  ఆధ్యాత్మికత కొవ్వు తక్కువ ఆహారం కాదు ఎవరు పడితే వారు కొనుక్కుని వాడేందుకు.  వైద్యులు చెయ్యగలిగేది, రోగితో మాటాడేటప్పుడు వారి మత విశ్వాసాల గురించి కూడా తెలుసుకుని ఆసక్తి ఉన్నవారికోసం ప్రవచనాలూ ప్రశాంత ఆధ్యాత్మిక వాతావరణమూ కూడా కల్పించి వైద్యుని మీదా నారాయణుని మీదా కూడా విశ్వాసం దృఢంగా ఉండే ఏర్పాటు చెయ్యడం.  చివరిగా డాక్టర్ హెరాల్డ్ కోయిన్ మాటల్లో, తమ సంక్షేమమూ ఆరోగ్యాల కోసం పూర్తి యాంత్రికమూ శారీరకమూ అయిపోయిన వైద్య ప్రక్రియనే నమ్ముకోకుండా తగిన విశ్వాసం కలిగి మనసును ప్రశాంత పరిచే ఆధ్యాత్మికతనూ ఆచరించేవారు త్వరితంగా కోలుకుంటారన్నది నిర్వివాదాంశం.      


No comments:

Post a Comment