Monday, March 1, 2021

పని మీదనే మనసు 

విలియం మౌల్టన్ మార్స్టన్ రీడర్స్ డైజెస్టులో రాసిన పుట్ యువర్ మైండ్ ఆన్ ది స్పాట్ అనే వ్యాసానికి సంగ్రహ అనువాదం

కొన్ని రోజుల క్రితం ఒక సర్జన్ అతి సున్నితమైన ఆపరేషన్ చెయ్యడం దగ్గర్నించి చూసేను.  అతని వేలి కదలికలలో వెంట్రుకవాసి తడబాటు చాలు రోగికి పక్షవాతమో చావో ప్రసాదించేందుకు.  ఆ డాక్టర్ కౌశలం కన్న నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది అతని ప్రశాంతత.  ఆపరేషన్ కి కొన్ని క్షణాల ముందు అతను ఎంతో గాభరా పడినట్టు కనిపించేడు.  కాని బల్లదగ్గర నించుని శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు మాత్రం ఎంతో ప్రశాంతంగా ఒక యంత్రంలా పనిచేసుకుపోవడం చూసి అబ్బురమనిపించింది.  

ఏ రంగంలోనైనా స్వశక్తితో పైకి వచ్చినవారిలో చేసే పనిమీద ఇటువంటి ధ్యాసా నిమగ్నతా అతి సాధారణం.  నాయకులూ సమర్ధులూ అయినవారు ఎప్పుడైనా తమ ఏకాగ్రతనై తాము చేస్తున్న ఒక్క పని మీదనే నిలుపుతారు.  మనలో మిగతా చాలామంది మాత్రం చేస్తున్న పనికి ఏమాత్రం సంబంధం లేని ఇతరత్రా దేనిగురించో ఆలోచించడం, దిగులు పడటం వంటి అనవసర విషయాల మీదికి మళ్ళిపోయేలా మనసును అనుమతిస్తాం. జీవితంలొ ఏదో రంగంలో నిష్ణాతులై విజేతలైనవారు కూడా ఇతర వ్యాపకాలైన పెయింటింగు, కవితం, ఇంకా వేరే ఇతర వ్యాపకాల్లోనూ తగు కౌశలాన్ని ప్రదర్శించి సకల కళావల్లభులై ఉండటమూ చూడవచ్చు.  ఆ బహుముఖ ప్రజ్ఞా చూసి మనకి అసూయా వేస్తుంది.  దేవుడితనికి ఎన్ని కళలిచ్చేడో అని.  కొంతవరకు అది వాస్తవం కావచ్చు కాని సర్వ సాధారణంగా వీరందరూ ఏకాగ్రతను అభ్యసించి సాధించిన వారు.  రోజువారీ తాము ఎన్ని పనులు చెయ్యాల్సి ఉన్నా మనసునూ బుద్ధినీ ఒకసారికి ఒక పనిమీదనే అది పూర్తయేవరకు కేంద్రీకరిస్తారు.  ఈనాడు ఇటువంటి ఏకాగ్రత పని సక్రమంగా సమర్ధంగా పూర్తిచేసేందుకే కాక ఎంతో ఉల్లాసంగా ఉండేందుకూ అత్యవసరం.  పరధ్యానమూ అన్యమనస్కతా అతి సాధారణమైన రోజులివి.  ఓ ఫోను కాలొస్తుంది; టీవీలో ఏదో ఆసక్తికర ప్రోగ్రాం ఒస్తుంటుంది; బయటినించి ఏవో శబ్దాలొస్తాయి స్నేహితులొచ్చి గప్పాలు కొడతారు లేదా దేనిగురించో బెంగపడతాం మనకి మనమే చేస్తున్న పని నించి ధ్యాస మళ్ళించుకుంటాం. చాలామటుకు ఏకాగ్రత కుదరని, పనికి అనుకూలంకాని పరిస్థితుల్లోనే పని చెయ్యాల్సొస్తుంది.  కాని మనం సఫలులమై విజేతలం కావాలంటే ఏకాగ్రత తప్పనిసరి.  అది పనికనేకాక మన అంతరంగ వికాసానికీ ఆవశ్యకమె.  పూర్తి శ్రద్ధపెట్టి పూర్తి చేద్దామనుకున్న ఎంతో ఉపయోగకరమైన ఎన్నో పనులు మన ఆహ్వానాన్ని మన్నించి మనసులో దూరి పనిని చెడగొట్టే ఎన్నో అనవసర జంఝాటాలవల్ల చెడిపోతుంటాయి.  ఇందుకు ఒకసారికి ఒకపనిమీదనే దృష్టీ ధ్యాసా నిలిచేలా అభ్యసించాలి.  కేంద్రీకరించిన మనస్సు తలుచుకున్నది ఏదైనా పూర్తిచెయ్యగల సమర్ధమైన ఉపకరణం.  మెకాలే దొర ఎంతో రద్దీగా ఉన్న లండన్ వీధుల్లో నడుస్తూ కూడా ఏకాగ్రత చెదరకుండా ఎదో పుస్తకం చదువుకుంటూ ఉండేవాడు.  ఒక పేజీని తిప్పి అందులో ఏముందో జ్ఞాపకం చేసుకుని వప్పచెప్పగలిగేవాడు.  ఇలాటివి విన్నప్పుడు అబ్బే అటువంటివి ఏదో అతీంద్రియ శక్తి ఉన్నవారికే కాని మన వల్లయేవి కావు లెండి అని దులిపేసుకుంటాం.  అది మీకు లేదని నిశ్చయగా చెప్పగలరా?  సామాన్యులం అనుకునే వారందరిలోను ఇటువంటి కౌశలం ఉంటుంది.  తేడా అల్లా అది వినియోగిస్తున్నారా లేదా అనేదానిలో ఉంటుంది.  చేసేపనిమీద మనసు కేంద్రీకరించే సామర్ధ్యం ప్రతి ఒక్కరికీ ఉంది.  కావాలని మళ్ళించుకుంటే తప్ప.  

మాటే వినిపించుకోరు అని పిల్లల మీద విసుక్కుంటుంటాం.  ఎల్డస్ హక్స్లీ అంటాడు: పదేళ్ళొచ్చేవరకు పసివారందరూ జ్ఞానులే అని.  చిన్న పిలలకి ఇష్టమైనదో ఆసక్తికరమైనదో వస్తువు కానీ పని కానీ అప్పజెప్తే ఎంత శ్రద్ధ దానిమీద పెడతారో మనం గమనిస్తూనే ఉంటాం.  అలా ఉన్నవారిని మనం పిలుపు వినిపించుకోవటం లేదని కోప్పడటం కూడా కద్దు.  కాని ఆ సమయంలో తమకిష్టమైనదానిమీద మనసుని పూర్తిగా కేంద్రీకరించి వాళ్ళు ఉంటారు.  ఆ పారవశ్యం నించి వారి దృష్టిని మళ్ళించే పని మనం చెయ్యకూడదు.     

ఏకాగ్రత కొందరికే పరిమితమైన అసాధారణ విశేషం కాదు.  మతిమరుపు పరధ్యానం ప్రొఫెసర్లకీ మనకీ తేడా ఏమంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పటి ఏకాగ్రతని వారు పెద్దయాకా నిలుపుకున్నారు. ఓసారి ఒక ప్రొఫెసర్గారు వానలో తడుస్తూ రెయిన్ కోటు గొడుగూ ధరించి తప్పించుకుందుకు విశ్వప్రయత్నం చేసే ఒక విద్యార్ధికి ఎవో తత్వజ్ఞాన సూత్రాలు వివరిస్తూండటం గమనించేను.  ఆ మహానుభావుడికి పాపం వర్షం కురుస్తోందన్న స్పృహ కూడా ఉన్నట్టు లేదు.  అటువంటి విలక్షణ స్వభావులని చూచి మనం నవ్వుకుంటాం.  కాని తమదైన రంగంలో వారి ప్రతిభ అనన్యసామాన్యం అని మనకి తెలుసు.  అటువంటి స్థితి వారు నిరంతరం అభ్యసించిన ఏకాగ్రతవల్ల సాధ్యపడుతుంది.  ఆ క్రమంలో మిగతావారు ధ్యాసను మళ్ళించే ఇతర చిల్లర విషయాలను అనుమతించి ఎటూ కాక పనులు పాడుచేసుకుంటే, వీరు మాత్రం వాటికా అవకాశమివ్వక తమ పనిమీదనే నిమగ్నమైన మనస్సుతో అందులో పరిణతి సాధిస్తారు.  కావాలంటే ఎవరైనా నిపుణుడు తనదైన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు అతని దృష్టిని మళ్ళించే ప్రయత్నం చెయ్యండి.  నాకు పరిచయం ఉన్న ఒక సుప్రసిద్ధ శిల్పి తను పనిలో ఉన్నప్పుడు గదిలోకి ఎవరొచ్చారు తనచుట్టు ఎవరు మూగారు అనికూడా గుర్తించని ధ్యానస్థితిలో పనిలో నిమగ్నమయేవాడు.  అంత నిమగ్నత ఉన్నప్పుడే చేసే పని ఏదైనా అత్యుత్తమ నాణ్యత కలిగి వుంటుంది. 

ఇటువంటి నిమగ్నత కావాలంటే చేసే పని మీద ఇష్టం పెంచుకోవాలి.  అలా పెంచుకున్న ఇష్టం ఒక వృక్షం అనుకుంటే ఏకాగ్రత దాని ఫలం. ఇష్టమూ ఏకాగ్రత. ఒకదానిననుసరించి ఒకటి.   

మరోలా చెప్పాలంటే, చేసే పనిలో ఏకాగ్రత పెరగాలంటే అది మనకి ఇష్టమైన పనైనా కాకున్నా నూటికి నూరుశాతం మనని మనం అందులో పడేసుకోవాలి.  దానిలో దూకితే నెమ్మది నెమ్మదిగా అది మనని అధీనంలోకి తెచ్చుకుని శ్రద్ధని పెంచుతుంది.  ఈ సత్యం గ్రహించడం ముఖ్యం.  పనిని మొదలుపెడితే ఆసక్తీ శ్రద్ధా అవే వస్తాయని తెలుసుకుంటే చాలు ప్రారంభించేందుకు వెనుకాడం.  అయితే చాలామంది పనిలోకి ఆటంకాలను ఆహ్వానిస్తారు.  కావాలని మరీ.  అయితే వారు గ్రహించనిదేమంటే, చేపట్టినది ఎంత నిరాసక్తమైన పనైనా, దానిలోకి దూకి చెయ్యడం మొదలెడితే దానికదే ఆసక్తికరంగా మారి మనం పూర్తిగా అందులో లీనమయేలా చేస్తుంది.  

విలియం జేంస్ అంటారు: కార్యాచరణలోకి అనుకున్నదే తడవుగా దూకాలి.  స్విచ్చు వేసిన యంత్రంలా పని పరుగు ప్రారంభం కావాలి.  ఆ పరుగులో శరీరమూ మనసూ ఎదీ వెనకబడకుండా రెండూ జంటగా సాగాలి. ఇష్టంలేని పనికనక రెండూ మొదట మొరాయించవచ్చు కాని అది లెక్క చెయ్యకుండా పనిని కొనసాగించాలి.  పని మొదలయాక సంబంధం లెని ఆలోచనలు, ఇంకేవో అభిప్రాయాలు మదిని ఆక్రమించే ప్రయత్నం చేసి పనికి ఆటంకాలు కలిగించవచ్చు. అయితే ఇటువంటివి మనసులోకి రాకుండా నిరోధించడం ఒక్కటే కాదు.  అవి ఖాళీ చేసిన స్థానాన్ని పనికి మరింత ప్రోత్సాహము స్ఫూర్తీ ఇచ్చే ఆలోచనలతో నింపాలి.  మనసునుంచి ఒక తలపుని బయటికి పంపెయ్యడం కుదరని పని.  ఉదాహరణకి ఒక ముప్ఫై సెకన్ల పాటు మనసులోకి కోతి రాకూడదంటే అది వచ్చి తీరుతుంది.  చాలామంది చేసే పొరపాటేమిటంటే చేసేపనిమీద ఏకాగ్రత సాధించడం కోసం ఇతర ఆలోచనలు రాకుండా నిరోధించడానికి ప్రయాస పడతారు కాని అది కాదు ప్రయాసంతా మనసుని చేసే పనికి కట్టి వుంచేందుకు పెట్టాలి.  ఎందుకంటే ఒక అనవసరపు ఆలోచనని బయటికి పంపితే దాని స్థానంలో ఒక డజను పనికిమాలినవి చేరుతాయి.  

ఇంకొన్ని సార్లు, ఒక పని చేస్తూ ఇంకోటి మనసులోకి తెచ్చుకుని అయ్యో అది ఇంకా ముఖ్యం అదే ముందు మొదలెట్టాల్సింది అది ఆపకూడనిదీ అని కూడా వింటాం. అదేం ఆపకూడనిదీ ఆపలేనిదీ కాదు.  అది మన భ్రమ అంతే.  అనవసర భయమూ దిగులూ అనే భూతాలు ఎవరికీ అగపడక మనముందే నిలిచి భయపడుతున్నకొద్దీ భయపెడతాయి.  పొమ్మంటే పోవు.  అందుకని నిజమే ఆ పని చాలా ముఖ్యమూ వెంటనే మొదలెట్టాల్సిందీను.  ఇదయాక అదే.  అని నిశ్చయించుకుని దీన్ని మరింత దీక్షతో కొనసాగించాలి.  ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది, ఒకసారికి ఒక పనే.  ఏది ముందు అని నిశ్చయమయి మొదలెట్టాక అది పూర్తయింతర్వాతే ఇంకోటి.  లేకుంటే మనది గానుగెద్దు ప్రయాస గానే మిగిలిపోతుంది.  పనికైనా ఆటకైనా ఇదే సూత్రం.  

అర్నాల్డ్ బెనెట్ ఏకాగ్రతని ఇలా నిర్వచించాడు.  "ఏం చెయ్యలో మనసుకి స్పష్టంగా ఆదేశమిచ్చి, చేసేది పూర్తయేవరకు అది ఇంకో ధ్యాస వైపు మళ్ళకుండా అదుపులో పెట్టగలిగే శక్తే ఏకాగ్రత" అని.  ఏకాగ్రతకి అభ్యాసం కావాలి.  అభ్యాసానికి ఓపిక కావాలి.  ముసిరే ఈగల్లా అగమ్యంగా సాగే అలోచనలన్నీ చేస్తున్న పనిమీదకి కేంద్రీకృతం చేసుకోగలిగే మనఃస్థితి, అందుకోసం మనం నిరంతరంగా చేసిన అభ్యాస ఫలితం.  అటూ ఇటూ ఎగిరిపోతున్న ఆలోచనలని సంకల్పించి వెనక్కి పట్టుకొచ్చి చేస్తున్న పనిలో పెట్టడం అభ్యాసం చేస్తే రానురాను వాటి పరుగులు ఆగిపోయి ఏ పని చేపడితే అది పూర్తిచేసే సామర్ధ్యం కలుగుతుంది.  

ఏకాగ్రత ఒక శక్తి.  ఆ శక్తి కలిగినవారికన్న దాన్ని అవసరమైనంత సమయమూ నిలిపి ఉంచేవారే కార్యశూరులు. ఏకాగ్రత సాధన ఒక యెత్తు, దాన్ని నిలిపి యుంచటం ఇంకో ఎత్తు.  అది అభ్యసించి సాధించినవారికి రెండు ప్రయోజనాలు.  చేపట్టి పూర్తిచెయ్యగల పనుల సణ్యా పెరుగుతుంది, అవి చేస్తుంటే లభించే ఆనందమూ పెరుగుతుంది.               

జర్మనీకి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి గొయెథేని ఎవరో అడిగారు మీ చేతించి జాలువారిన ఏ సాహితీ ప్రక్రియ అయినా అంత పరిపూర్ణతతో ఎలా శొభిస్తుంది అని.  ఏముంది పని మొదలెట్టేముందు ఓ సారి చేతులమీద గట్టిగా ఊది అవి ఖాళీ చేసుకుంటానంటాడు అతను.   

No comments:

Post a Comment