ప్రార్ధన పనికొచ్చేదేనా
డాక్టర్ ల్యారీ డోసీ రచన
నేను టెక్సాస్ పార్క్‌ల్యాండ్ మెమోరియల్ ఆసుపత్రిలో ట్రెయినీ గా ఉన్నప్పుడు మొదటి పేషంటును అప్పజెప్పారు. అతని రెండు ఊపిరితిత్తులూ చెడిపోయిన క్యాన్సర్ పేషంటు. ఆఖరి దశలో ఉన్నాడు. ఎదో చెయ్యాలి కదాని చెయ్యదగ్గ ఒకటి రెండు థెరపీలు వివరించే ప్రయత్నం చేసేను. కొన ఊపిరితోనే ఉన్నా మాట వినగలిగిన అతను నీరసమైన గొంతుతో ఇంకేవీ ఒద్దని ప్రాధేయపడ్డాడు. నా మనసులోని అభిప్రాయమూ ఇదే.