Monday, October 4, 2021


ప్రార్ధన పనికొచ్చేదేనా 

డాక్టర్ ల్యారీ డోసీ రచన 

నేను టెక్సాస్ పార్క్‌ల్యాండ్ మెమోరియల్ ఆసుపత్రిలో ట్రెయినీ గా ఉన్నప్పుడు మొదటి పేషంటును అప్పజెప్పారు.  అతని రెండు ఊపిరితిత్తులూ చెడిపోయిన క్యాన్సర్ పేషంటు.  ఆఖరి దశలో ఉన్నాడు.  ఎదో చెయ్యాలి కదాని చెయ్యదగ్గ  ఒకటి రెండు థెరపీలు వివరించే ప్రయత్నం చేసేను.  కొన ఊపిరితోనే ఉన్నా మాట వినగలిగిన అతను నీరసమైన గొంతుతో ఇంకేవీ ఒద్దని ప్రాధేయపడ్డాడు.    నా మనసులోని అభిప్రాయమూ ఇదే.   

Tuesday, September 14, 2021


పై పోర్షను పోషణ

 

మానసికారోగ్యానికీ కార్యకుశలతకీ ప్రముఖ మోటివేషనల్ రచయిత, వక్త జిగ్ జిగ్లర్ చేసిన కొన్ని సూచనలు. 


ప్రతివాళ్ళూ తింటారు.  అదీ నిర్ణీత సమయానికి తినేలా ప్రణాళికలు వేసుకు మరీ తింటారు.  ఆ టైం అయేసరికి అది కడుపులో పడాల్సిందే.  ఎప్పుడైనా పని వత్తిడిలో ఏ బ్రేక్‌ఫాస్తో లంచో డిన్నరో మిస్సైపోతే, ఆ సంగతి చెప్పుకు మరీ బాధపడతారు వినేవాళ్ళుండాలే కాని.  నిన్న ఏమైందనుకుంటున్నావ్? 

Sunday, July 18, 2021

ఉచితం అనుచితం




అనగనగా ఒక రాజు తన మంత్రిమండలిని సమావేశపరిచి, సచివోత్తములారా. మనమెవరం ఉన్నన్ని నాళ్ళు ఉండం.  తోచిన పనులేవో చేస్తున్నాం. కాని శాశ్వతంగా నిలిచేదేదో చెయ్యలేకపోతున్నామే అనిపిస్తోంది.  మీకో పని అప్పజెప్తాను.  మీ మేధాశక్తిని రంగరించి అందరికీ పనికొచ్చే లోకజ్ఞాన సారాన్ని గ్రంథస్తం చేసుకు రండి.  భావితరాలు అది చదువుకు బాగుపడతారు. వెళ్ళి రండి అన్నాడు.

Monday, July 12, 2021


మనకి తెలీని మనిషి






అలెక్సిస్ కారెల్, MD  నోబెల్ బహుమతి గ్రహీత

మనిషి ఆకృతి నడకా ముఖమూ అతను ఏమిటన్నది వెల్లడిస్తాయి.   అతని ఆకారం అతని దేహ మనస్స్వభావాలనీ శక్తులనూ ప్రకటిస్తుంది. 

Wednesday, April 7, 2021


దైవ భావన - ఒక తత్వవేత్త అభిప్రాయం 

 

డాక్టర్ హ్యారీ ఎమర్సన్ ఫాస్డిక్ తో నార్డీ కేంపియన్ ఇంటర్వ్యూ సారాంశం.  ఇది రీడర్సు డైజేస్త్టు పాత సంచికలోనిది. 

Monday, March 1, 2021


పని మీదనే మనసు 



విలియం మౌల్టన్ మార్స్టన్ రీడర్స్ డైజెస్టులో రాసిన పుట్ యువర్ మైండ్ ఆన్ ది స్పాట్ అనే వ్యాసానికి సంగ్రహ అనువాదం

కొన్ని రోజుల క్రితం ఒక సర్జన్ అతి సున్నితమైన ఆపరేషన్ చెయ్యడం దగ్గర్నించి చూసేను.  అతని వేలి కదలికలలో వెంట్రుకవాసి తడబాటు చాలు రోగికి పక్షవాతమో చావో ప్రసాదించేందుకు.  ఆ డాక్టర్ కౌశలం కన్న నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది అతని ప్రశాంతత.  ఆపరేషన్ కి కొన్ని క్షణాల ముందు అతను ఎంతో గాభరా పడినట్టు కనిపించేడు.  కాని బల్లదగ్గర నించుని శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు మాత్రం ఎంతో ప్రశాంతంగా ఒక యంత్రంలా పనిచేసుకుపోవడం చూసి అబ్బురమనిపించింది.  

Saturday, February 20, 2021

భావనలే భాగ్యరాశులు 







రచయిత ముందుమాట

ఈ పుస్తకం రాయమని నన్ను ప్రోత్సహించినవారు ఆండ్రూ కార్నెగీ.   అతి సామాన్య స్థాయినించి ఒక బిలియనీర్ గా ఎదిగిన తన ప్రస్థానన్ని వివరిస్తూ, ఆ స్థాయికి చేరేందుకు తాను ఆచరించిన రహస్య సూత్రాన్ని నాకు చెప్పారు.  ఇది లోకమంతకూ వెల్లడి చెయ్యదగ్గ రహస్యం. 

Saturday, February 6, 2021



సెప్టెంబెర్ పదకొండు, 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సదస్సు అహ్వానానికి స్వామి వివేకానంద ఉపన్యాస సారాంశము..


 

ఆత్మీయత, సౌహార్దం నిండిన మీ ఆహ్వానానికి స్పందించి నించుంటూంటే మాటల్లో వెల్లడించలేని ఆనందం హృదయంలో ఉప్పొంగుతోంది. ఇందుకు ప్రపంచంలోని అతి ప్రాచీన ఋషి సాంప్రదాయం పేరిట, ప్రపంచ మతాలకు మాతృసమానమైన మతధర్మం పేరిట, సర్వ హిందూ జనుల పేరిట మీకు నా ధన్యవాదాలు.  

Saturday, January 30, 2021


ఇచ్చుటలో ఉన్న హాయి





రచయిత ముందుమాట 

Try giving yourself away అన్న పేరుతో రీడర్స్ డైజెస్ట్లో ప్రచురితమైన చిన్న వ్యాసాన్ని పుస్తకరూపంలో విస్తరించి అందించమనే సంపాదకుల సూచననుసరించి ఈ పుస్తకరచన చేశాను.  Try giving yourself away అంటే నిన్ను నీవు ఇచ్చుకొందుకు యత్నించు  అని.  ఇచ్చే ధర్మాన్ని అన్ని మతాలూ ప్రబోధించాయి. ప్రపంచం లో మనిషికీ మనిషికీ మధ్య ఇచ్చిపుచ్చుకోవడం అనే సంస్కారం వ్యక్తిస్థాయిలోనే కాని ప్రభుత్వాలూ నాయకులూ చెయ్యలేరు.  మనబోటి సాధారణపౌరులే ఈ సంప్రదాయాన్ని పెంచి పరస్పర  సహకారపు విలువను గ్రహించుకోవాలి.  

Saturday, January 23, 2021

 

నీతివర్తనం (ఇంటెగ్రిటీ) 





ఆర్థర్ గోర్డాన్, బ్రిటిష్ రచయిత

(మూలం రీడర్స్ డైజెస్ట్)

చదువు, నైపుణ్యం, సమయస్ఫూర్తి, దృక్పథమూ అన్ని ఉద్యోగాలకీ ముఖ్యార్హతలు. ఇవి చూసి తీసుకున్న ఉద్యోగులకి పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగించేముందు యాజమాన్యాలు చూచేది వారి నీతివర్తనం. ఇంగ్లీషులో ఇంటెగ్రిటీ. ఇది మిగతా అర్హతల ప్రయోజనాన్ని పదింతలు చేస్తుంది.

Sunday, January 17, 2021

 

ఆనందమార్గం 



ముందుమాట 

చాలామటుకు, లోకపుతీరు గురించిన అవగాహనాలెమి, పొరపాటుగ అర్ధం చేసుకున్న నైతిక నియమాలు, కట్టుబాట్లు వంటివి, మనుషులకైనా జంతువులకైనా అనందానికి ఏదైతే ముఖ్యమో దాని పట్ల పెంపొందాల్సిన అభిరుచిని నాశనం చేసి ఖిన్నతనూ విషాదాన్ని మిగులుస్తాయని నేను నమ్ముతాను.   ఇవన్నీ వ్యక్తి స్వాధీనంలో ఉండేవే.  మరియు, సగటు జీవనాదాయానికి ఢోకాలేని పక్షంలో, వ్యక్తి సంతోష సాధనకి ఏది అవసరమో అది సూచించే ప్రయత్నం  చేస్తాను.

Saturday, January 9, 2021

స్వామి వివేకానంద ఉపన్యాసాలు : పని, దాని రహస్యం.

 




స్వామి వివేకానంద ఉపన్యాసాలు : పని, దాని రహస్యం.

లాస్ ఏంజెల్స్ జనవరి నాలుగు, 1900

చెయ్యాల్సిన పనెంత ముఖ్యమో అది చేసే విధానమూ అంతే ముఖ్యమన్నది నేను నేర్చుకున్న ఉత్తమ పాఠాల్లో ఒకటి.  బోధనలు కాక తన జీవితమే ఒక ఉదాహరణగా నాకు ఇది నేర్పి, దాని నుంచి ఇంకెన్నో నేర్చుకునేలా చేసేరు నా గురుదేవులు.  పనెంత ముఖ్యమో విధానమూ అంతే ముఖ్యం.     

Wednesday, January 6, 2021

రోజువారీ - ఒక జీవన విధానం











1849-1919 మధ్య జివించిన సర్ విలియం ఓస్లర్ కెనడాకి చెందిన ప్రముఖ వైద్యుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. వైద్యరంగంలో కొత్త ఆవిష్కరణలకి ఆద్యుడు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ గా వైద్య ప్రపంచం ఆయన్ని పిలుస్తుంది. ఆయన జాన్ హాప్కిన్స్ అనే ప్రముఖ వైద్యాలయ స్థాపకుల్లో ఒకరు. ఆయన యేల్ మెడికల్ విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగం ఏ వే ఆఫ్ లైఫ్ గా ప్రచురితమైంది. మంచి సందేశం ఉన్న ఆ ఉపన్యాసం తెలుగులో మీకోసం అనువదించి చదివినవారు