Sunday, July 18, 2021

ఉచితం అనుచితం




అనగనగా ఒక రాజు తన మంత్రిమండలిని సమావేశపరిచి, సచివోత్తములారా. మనమెవరం ఉన్నన్ని నాళ్ళు ఉండం.  తోచిన పనులేవో చేస్తున్నాం. కాని శాశ్వతంగా నిలిచేదేదో చెయ్యలేకపోతున్నామే అనిపిస్తోంది.  మీకో పని అప్పజెప్తాను.  మీ మేధాశక్తిని రంగరించి అందరికీ పనికొచ్చే లోకజ్ఞాన సారాన్ని గ్రంథస్తం చేసుకు రండి.  భావితరాలు అది చదువుకు బాగుపడతారు. వెళ్ళి రండి అన్నాడు.

Monday, July 12, 2021


మనకి తెలీని మనిషి






అలెక్సిస్ కారెల్, MD  నోబెల్ బహుమతి గ్రహీత

మనిషి ఆకృతి నడకా ముఖమూ అతను ఏమిటన్నది వెల్లడిస్తాయి.   అతని ఆకారం అతని దేహ మనస్స్వభావాలనీ శక్తులనూ ప్రకటిస్తుంది. 

Wednesday, April 7, 2021


దైవ భావన - ఒక తత్వవేత్త అభిప్రాయం 

 

డాక్టర్ హ్యారీ ఎమర్సన్ ఫాస్డిక్ తో నార్డీ కేంపియన్ ఇంటర్వ్యూ సారాంశం.  ఇది రీడర్సు డైజేస్త్టు పాత సంచికలోనిది. 

Monday, March 1, 2021


పని మీదనే మనసు 



విలియం మౌల్టన్ మార్స్టన్ రీడర్స్ డైజెస్టులో రాసిన పుట్ యువర్ మైండ్ ఆన్ ది స్పాట్ అనే వ్యాసానికి సంగ్రహ అనువాదం

కొన్ని రోజుల క్రితం ఒక సర్జన్ అతి సున్నితమైన ఆపరేషన్ చెయ్యడం దగ్గర్నించి చూసేను.  అతని వేలి కదలికలలో వెంట్రుకవాసి తడబాటు చాలు రోగికి పక్షవాతమో చావో ప్రసాదించేందుకు.  ఆ డాక్టర్ కౌశలం కన్న నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది అతని ప్రశాంతత.  ఆపరేషన్ కి కొన్ని క్షణాల ముందు అతను ఎంతో గాభరా పడినట్టు కనిపించేడు.  కాని బల్లదగ్గర నించుని శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు మాత్రం ఎంతో ప్రశాంతంగా ఒక యంత్రంలా పనిచేసుకుపోవడం చూసి అబ్బురమనిపించింది.  

Saturday, February 20, 2021

భావనలే భాగ్యరాశులు 







రచయిత ముందుమాట

ఈ పుస్తకం రాయమని నన్ను ప్రోత్సహించినవారు ఆండ్రూ కార్నెగీ.   అతి సామాన్య స్థాయినించి ఒక బిలియనీర్ గా ఎదిగిన తన ప్రస్థానన్ని వివరిస్తూ, ఆ స్థాయికి చేరేందుకు తాను ఆచరించిన రహస్య సూత్రాన్ని నాకు చెప్పారు.  ఇది లోకమంతకూ వెల్లడి చెయ్యదగ్గ రహస్యం. 

Saturday, February 6, 2021



సెప్టెంబెర్ పదకొండు, 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సదస్సు అహ్వానానికి స్వామి వివేకానంద ఉపన్యాస సారాంశము..


 

ఆత్మీయత, సౌహార్దం నిండిన మీ ఆహ్వానానికి స్పందించి నించుంటూంటే మాటల్లో వెల్లడించలేని ఆనందం హృదయంలో ఉప్పొంగుతోంది. ఇందుకు ప్రపంచంలోని అతి ప్రాచీన ఋషి సాంప్రదాయం పేరిట, ప్రపంచ మతాలకు మాతృసమానమైన మతధర్మం పేరిట, సర్వ హిందూ జనుల పేరిట మీకు నా ధన్యవాదాలు.  

Saturday, January 30, 2021


ఇచ్చుటలో ఉన్న హాయి





రచయిత ముందుమాట 

Try giving yourself away అన్న పేరుతో రీడర్స్ డైజెస్ట్లో ప్రచురితమైన చిన్న వ్యాసాన్ని పుస్తకరూపంలో విస్తరించి అందించమనే సంపాదకుల సూచననుసరించి ఈ పుస్తకరచన చేశాను.  Try giving yourself away అంటే నిన్ను నీవు ఇచ్చుకొందుకు యత్నించు  అని.  ఇచ్చే ధర్మాన్ని అన్ని మతాలూ ప్రబోధించాయి. ప్రపంచం లో మనిషికీ మనిషికీ మధ్య ఇచ్చిపుచ్చుకోవడం అనే సంస్కారం వ్యక్తిస్థాయిలోనే కాని ప్రభుత్వాలూ నాయకులూ చెయ్యలేరు.  మనబోటి సాధారణపౌరులే ఈ సంప్రదాయాన్ని పెంచి పరస్పర  సహకారపు విలువను గ్రహించుకోవాలి.  

Saturday, January 23, 2021

 

నీతివర్తనం (ఇంటెగ్రిటీ) 





ఆర్థర్ గోర్డాన్, బ్రిటిష్ రచయిత

(మూలం రీడర్స్ డైజెస్ట్)

చదువు, నైపుణ్యం, సమయస్ఫూర్తి, దృక్పథమూ అన్ని ఉద్యోగాలకీ ముఖ్యార్హతలు. ఇవి చూసి తీసుకున్న ఉద్యోగులకి పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగించేముందు యాజమాన్యాలు చూచేది వారి నీతివర్తనం. ఇంగ్లీషులో ఇంటెగ్రిటీ. ఇది మిగతా అర్హతల ప్రయోజనాన్ని పదింతలు చేస్తుంది.

Sunday, January 17, 2021

 

ఆనందమార్గం 



ముందుమాట 

చాలామటుకు, లోకపుతీరు గురించిన అవగాహనాలెమి, పొరపాటుగ అర్ధం చేసుకున్న నైతిక నియమాలు, కట్టుబాట్లు వంటివి, మనుషులకైనా జంతువులకైనా అనందానికి ఏదైతే ముఖ్యమో దాని పట్ల పెంపొందాల్సిన అభిరుచిని నాశనం చేసి ఖిన్నతనూ విషాదాన్ని మిగులుస్తాయని నేను నమ్ముతాను.   ఇవన్నీ వ్యక్తి స్వాధీనంలో ఉండేవే.  మరియు, సగటు జీవనాదాయానికి ఢోకాలేని పక్షంలో, వ్యక్తి సంతోష సాధనకి ఏది అవసరమో అది సూచించే ప్రయత్నం  చేస్తాను.

Saturday, January 9, 2021

స్వామి వివేకానంద ఉపన్యాసాలు : పని, దాని రహస్యం.

 




స్వామి వివేకానంద ఉపన్యాసాలు : పని, దాని రహస్యం.

లాస్ ఏంజెల్స్ జనవరి నాలుగు, 1900

చెయ్యాల్సిన పనెంత ముఖ్యమో అది చేసే విధానమూ అంతే ముఖ్యమన్నది నేను నేర్చుకున్న ఉత్తమ పాఠాల్లో ఒకటి.  బోధనలు కాక తన జీవితమే ఒక ఉదాహరణగా నాకు ఇది నేర్పి, దాని నుంచి ఇంకెన్నో నేర్చుకునేలా చేసేరు నా గురుదేవులు.  పనెంత ముఖ్యమో విధానమూ అంతే ముఖ్యం.     

Wednesday, January 6, 2021

రోజువారీ - ఒక జీవన విధానం











1849-1919 మధ్య జివించిన సర్ విలియం ఓస్లర్ కెనడాకి చెందిన ప్రముఖ వైద్యుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. వైద్యరంగంలో కొత్త ఆవిష్కరణలకి ఆద్యుడు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ గా వైద్య ప్రపంచం ఆయన్ని పిలుస్తుంది. ఆయన జాన్ హాప్కిన్స్ అనే ప్రముఖ వైద్యాలయ స్థాపకుల్లో ఒకరు. ఆయన యేల్ మెడికల్ విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగం ఏ వే ఆఫ్ లైఫ్ గా ప్రచురితమైంది. మంచి సందేశం ఉన్న ఆ ఉపన్యాసం తెలుగులో మీకోసం అనువదించి చదివినవారు 

Thursday, December 31, 2020

















స్వర్ణయోగి

(Summarized translation of Paulo Coelho's "Alchemist")

ఇది శాంటియాగో అనే గొర్రెల కాపరి కుర్రాడి కథ. కథా ప్రారంభ సమయానికి ప్రతి సాయంత్రం లాగే తన మందని తెచ్చి స్పెయిన్ లోని ఆ పాడు పడ్డ చర్చీ, దాని గోడల్ని బీటలు వారుస్తూ దట్టంగా పెరిగిన రావి మొక్కా ఉన్నచోట ఆ రాత్రి తలదాచుకునేందుకు నిశ్చయించుకుంటాడు.

Saturday, December 26, 2020

 






కొన్ని చిన్న కథలు (ఇంటర్నెట్ నించి సంగ్రహించి అనువదించినది)
మీరు చదివే వుంటారు గాని ఇంకోసారి.

ఒకటి: గజం మిధ్య

మచ్చిక చేసిన గజరాజుల మందనొకదాన్ని చూశాడొక పెద్దాయన. గ్రావంబంతలేసి గజరాజులని బోనుల్లో పెట్టి గానీ గొలుసులతో కట్టి గానీ బంధించక సన్నని చిన్న తాళ్ళతో కట్టి నిలపడం ఆశ్చర్యమనిపించింది.

Monday, December 14, 2020

 





లోకానికి దయాగుణాన్ని మన పిల్లలకు స్వేచ్ఛను ప్రసాదిద్దాం.

కైలాష్ సత్యార్ధి నార్వే రాజధాని ఓస్లోలొ నోబెల్ శాంతి బహుమతి గ్రహిస్తూ చేసిన ఉపన్యాసానికి స్వేచ్ఛానువాదం.

Friday, December 11, 2020

 







మనకి తెలీని మన మెదడు శక్తి

మూల రచయిత: బ్రూస్ బ్లివెన్ (రీడర్స్ డైజెస్ట్ పాత సంచిక వ్యాసానికి స్వేచ్ఛానువాదము)

మన మెదడు విశ్వంలోనే ఒక అద్భుతం.  చాలామంది అనుకున్నట్టు అది ఎంతో సున్నితమైందే; కాని అనుకున్నదానికన్న ఎక్కువ దృఢమైన దీ, నిలకడైనదీ కూడా.  

Thursday, December 3, 2020

ప్రకృతి ("Nature" by Ralph Waldo Emerson)

 



ఇది వెనక చూపుల యుగం. పూర్వుల స్మారకాలు నిర్మించుకుంటూ, వారి కథలూ, చరిత్రలూ, విమర్శలూ రాసుకునే పనిలో వుంది. పూర్వులు సృష్టినీ సృష్టికర్తనీ స్వయంగా దర్శిస్తే, మనం ఆ పనికి వారి కళ్ళనే ఎరువు తెచ్చుకుంటున్నాం. సృష్టిని ఉన్నదున్నట్టు వారిలాగే మనమూ ఎందుకని ఆనందించకూడదు?

Saturday, November 7, 2020

Thursday, October 15, 2020

జీవితంలో నటన అవసరం ("Play it" - an Article from Reader's Digest)




ఒక మంచి నాటకాన్నో సినిమానో చూస్తున్నంతసేపు వాటిలోని ఉత్సాహ ఉద్వేగాలతో మనసు పొంగిపోయి మన జీవితంకన్న అవే వాస్తవమన్న అనుభూతిని కలిగిస్తాయి కద. ఒక చిన్న వేదిక, చిన్ని తెరల మీద చూపిన నటనే అంత ప్రభావవంతమైనప్పుడు అదే నటనని అంతకన్న పెద్ద వేదిక, పెద్ద తెర, మరింత ఉత్సాహభరితమూ ఉద్వేగభరితమూ అయిన జీవిత రంగం మీద విజయవంతంగా ప్రదర్శించడం ఎందుకు సాధ్యం కాదు?

స్టీవ్ జాబ్స్, జూన్ 14 2005 స్టాన్ ఫోర్డ్



స్టీవ్ జాబ్స్, జూన్ 14 2005 స్టాన్ ఫోర్డ్

అత్త్యుత్తమ ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఇక్కడ మీ స్నాతకోత్సవానికి హాజరు కావడం నాకు దక్కిన గౌరవం.  నాకు కాలేజీ పట్టా లేదు. నిజానికి ఒక కళాశాల పట్టాకి ఇంత చేరువయ్యింది ఇప్పుడే.  ఈ రోజు నా జీవితానికి సంబంధించిన మూడు కథలు చెప్తాను.  అంతే.  ఎక్కువేం లేదు.  మూడే కథలు.

Friday, May 1, 2020

JF Kennedy Inaugural Address




 JF Kennedy Inaugural Address

ఉపాధ్యక్షులు జాన్సన్ గారికిస్పీకర్ మహాశయులకు, ప్రధాన న్యాయమూర్తివర్యులకు, అధ్యక్షులు ఐసెన్‌హవర్ గరికిఉపాధ్యక్షులు నిక్సన్ గారికి, అధ్యక్షులు ట్రూమన్ గారికి, మాన్యులైన మతాధికారులకు, నా సహ అమెరికా పౌరులకు: